నా దృష్టిలో చాగంటి ఏ అవార్డుకు అయినా అర్హులే: సోము వీర్రాజు
- చాగంటికి గురజాడ పురస్కారం
- వ్యతిరేకిస్తున్న కవులు, కళాకారులు
- విజయనగరంలో నిరసన ర్యాలీ
- స్పందించిన సోము వీర్రాజు
- చాగంటి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించేది లేదని వార్నింగ్
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ, విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు.
ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
చాగంటి గారు అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని కీర్తించారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.