టీడీపీ నేత కోటంరెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్
- నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డిపై దాడి
- ఆసుపత్రిలో చేరిన నేత
- రాజకీయకోణంలో దాడి జరిగిందన్న కోటంరెడ్డి భార్య
- జిల్లాలో ఏది జరిగినా తనకు ఆపాదిస్తున్నారన్న అనిల్
నెల్లూరు పట్టణ టీడీపీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టారంటూ వార్తలు రావడం తెలిసిందే. కోటంరెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడి అని ఆయన భార్య ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం అని పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో తనపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. జిల్లాలో ఏది జరిగినా తనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. కోటంరెడ్డి శ్రీనివాసులు విషయంలో వ్యక్తిగత విభేదాల వల్లే దాడి జరిగిందని అన్నారు.