పవిత్ర లోకేశ్ పై ట్రోలింగ్... 15 యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్ర
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
- యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్ల నిర్వాహకులకు నోటీసులు
- మూడ్రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
తన ఫొటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ దక్షిణాది నటి పవిత్ర లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై అసత్య కథనాలు వెలువరించిన యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్ల లింకులను కూడా ఆమె పోలీసులకు అందించారు.
పవిత్ర నుంచి ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 15 యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేశారు. మూడ్రోజుల్లోపు విచారణకు హాజరు కావాలంటూ సదరు యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్ల నిర్వాహకులను ఆదేశించారు.
ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రల సాన్నిహిత్యం గురించి తీవ్రస్థాయిలో కథనాలు వచ్చాయి. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల సందర్భంగా కూడా వీరిద్దరూ జంటగా కనిపించడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది.