రష్యా వద్ద తరిగిపోతున్న ఆయుధ నిల్వలు... పాత ఆయుధాలను బయటికి తీస్తున్న వైనం
- గత ఎనిమిది నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- పలు రష్యా ఆయుధాగారాల్లో అడుగంటిన నిల్వలు
- 80వ దశకం నాటి అణుక్షిపణులతో నెట్టుకొస్తున్న రష్యా
- అణు వార్ హెడ్లు తొలగించి ఉక్రెయిన్ పై ప్రయోగం
గత ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనిమిది నెలలుగా దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉక్రెయిన్ ఏమాత్రం లొంగకపోగా, తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ కు చెందిన పలు భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకున్నప్పటికీ, రాజధాని కీవ్ పై ఏమాత్రం పట్టు సాధించలేకపోయింది.
ఈ క్రమంలో పలు రష్యా ఆయుధాగారాల్లో నిల్వలు తరిగిపోతున్నాయని బ్రిటన్ సైనిక నిఘా విభాగం పేర్కొంది. ఆయుధ నిల్వలు అడుగంటిపోతుండడంతో రష్యా పాత ఆయుధాలను బయటికి తీస్తోందని వెల్లడిచింది. ఆఖరికి పాత అణుక్షిపణులను కూడా ఉక్రెయిన్ పై ప్రయోగిస్తోందని, అయితే ఆ క్షిపణుల్లోని అణు వార్ హెడ్లను తొలగించి ప్రయోగిస్తోందని బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది.
ఇటీవల రష్యా ప్రయోగించిన ఓ క్షిపణిని ఉక్రెయిన్ బలగాలు కూల్చేశాయి. అందుబాటులో ఉన్న చిత్రాలను పరిశీలిస్తే, ఆ క్షిపణి ఏఎస్-15 కెంట్ గగనతల క్రూయిజ్ మిస్సైల్ (ఏఎల్ సీఎమ్) అని వెల్లడైందని బ్రిటన్ నిఘా సంస్థ వెల్లడించింది. ఈ క్షిపణి 1980 నాటిదని పేర్కొంది. ఈ కారణంగానే రష్యా పాత ఆయుధాలను వెలికి తీస్తోందన్న విషయం నిర్ధారణ అవుతోందని వివరించింది.