హీరో అవుతారని రజనీకాంత్ ఎప్పుడూ అనుకోలేదు: సీనియర్ నటుడు నారాయణరావు

  • నిర్మాతగా .. నటుడిగా నారాయణరావుకు పేరు 
  • చిరూ .. సుధాకర్ తో కలిసి అవకాశాల కోసం తిరిగిన రోజులు 
  • ముందుగా సుధాకర్ కి ఛాన్స్ రావడం గురించిన ప్రస్తావన 
  • విలన్ కావాలనే రజనీకి ఉండేదంటూ వివరణ     
నిర్మాతగా .. నటుడిగా జీవీ నారాయణరావుకి మంచి పేరు ఉంది. రజనీకాంత్ .. చిరంజీవి .. రాజేంద్రప్రసాద్ .. నారాయణరావు .. సుధాకర్ .. హరిప్రసాద్ వీళ్లంతా కూడా అప్పట్లో ఒకే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వచ్చారు. అందువలన వాళ్లందరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ విషయాలను గురించి తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణరావు ప్రస్తావించారు. 

"చిరంజీవిగారు .. సుధాకర్ గారు కలిసి భారతీరాజా గారి సినిమాలో అవకాశం కోసం వెళితే సుధాకర్ కి ముందుగా ఛాన్స్ వచ్చింది. అలాగే నేను .. రజనీకాంత్ కలిసి వెళ్లిన కొన్ని చోట్ల నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తరువాత రజనీ ఏ స్థాయికి వెళ్లారనే విషయం తెలిసిందే. ఎవరికి అవకాశం వచ్చినా అందరం ఆనందించే వాళ్లం. మరో ఆలోచన మా మధ్యలోకి ఎప్పుడూ వచ్చేది కాదు" అన్నారు. 

"రజనీకాంత్ గారు సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే స్టయిల్ గా ఉండేవారు. మొదటి నుంచి కూడా ఆయనకి బాలీవుడ్ విలన్ శత్రుఘ్న సిన్హా స్టయిల్ అంటే ఇష్టం. అలా స్టయిలిష్ విలన్ కావాలనేది రజనీ ఆలోచన. హీరో కావాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు .. అవుతానని కలగనలేదు. విలన్ తరహా పాత్రలతో మొదలుపెట్టే ఆయన హీరో అయ్యారు" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News