ఫోన్ పోతే అందులోని పేమెంట్ యాప్స్ ఇలా బ్లాక్ చేయొచ్చు..!

  • నేడు అన్ని చెల్లింపులకూ కీలకంగా మారిన పేమెంట్ యాప్స్
  • ప్రతి ఒక్కరి ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం
  • ఫోన్ పోతే వెంటనే వీటిని బ్లాక్ చేయడం ఎంతో ముఖ్యం
నేడు స్మార్ట్ ఫోన్ అనేది ఎంతో ముఖ్యమైన, కీలకమైన పరికరంగా మారిపోయింది. నగదుతో పని లేకుండా అన్ని పనులు చేసి పెట్టే మినీ ఏటీఎంలా స్మార్ట్ ఫోన్ మారిపోయింది. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే ఈ యాప్స్ ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంటాయి. కనుక మన ఫోన్ ఒకవేళ ఎక్కడైనా పడిపోతే, ఎవరైనా చోరీ చేస్తే.. అందులోని పేమెంట్ యాప్స్ పరిస్థితి ఏంటి..? ఆ ఫోన్ ను దుర్వినియోగం చేయరన్న నమ్మకం ఏంటి?

ఫోన్ ఏక్కడైనా పడిపోయినా, చోరీకి గురైన, కనిపించకుండా పోయినా.. వెంటనే జాప్యం చేయకుండా ఫోన్ నంబర్, ఫోన్లోని పేమెంట్ యాప్స్ ను బ్లాక్ చేయాలి. దీనివల్ల ఫోన్ అపరిచితుల చేతుల్లోకి వెళ్లినా, దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు. పేటీఎం యాప్ ఉంటే 01204456456 నంబర్ కు కాల్ చేయాలి. ముందుగా కావాల్సిన భాషను ఎంపిక చేసుకున్న తర్వాత, లాస్ట్ ఫోన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. లేదా అన్ ఆథరైజ్డ్ యూసేజ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. పోయిన ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. పేటీఎం వెబ్ సైట్ కు వెళ్లి కూడా దీన్ని చేసుకోవచ్చు. 

ఫోన్ పే అయితే 080 68727374 నంబర్ కు కాల్ చేయాలి. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కు కనెక్ట్ అవుతుంది. రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడి వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఇక గూగుల్ పే యూజర్లు 1800 419 0157 నంబర్ కు కాల్ చేసి టాక్ టు గూగుల్ రిప్రజెంటేటివ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తదుపరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత అకౌంట్ బ్లాక్ అయిపోతుంది.


More Telugu News