అన్నయ్య పోవడంతో అంతా శూన్యమైపోయింది: కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు
- కృష్ణ సక్సెస్ లో ఆయన తమ్ముడు ఆది శేషగిరిరావు పాత్ర
- అన్నయ్యతో 70 ఏళ్ల అనుబంధం ఉందని వ్యాఖ్య
- ఆయన సైకిల్ పై స్కూల్ కి వెళ్లానని వెల్లడి
- ఆయన లేకపోవడం తీరని లోటు అంటూ ఆవేదన
- స్మారక మందిర నిర్మాణం ఉంటుందని వివరణ
కృష్ణ కెరియర్ ను పరిశీలిస్తే, ఆయన విజయంలో ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు పాత్ర ఎంతనేది అర్థమవుతుంది. హీరోగా .. నిర్మాతగా .. దర్శకుడిగా.. ఇలా కృష్ణ ఏ మార్గంలో ముందుకు వెళుతున్నా, దానికి ముందుగా ఆయన ఆదిశేషగిరిరావుతో మాట్లాడవలసిందే. ఇద్దరి మధ్య చర్చలు జరిగిన తరువాతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేది. ఇద్దరి మధ్య అంతటి అనుబంధం, అవగాహన వున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ .. " నా చిన్నప్పుడు సైకిల్ పై మా అన్నయ్య సినిమాలకి తీసుకుని వెళ్లడం నాకు ఇంకా గుర్తుంది. మద్రాసులో ఆయన దగ్గరే ఉంటూ నేను చదువుకునేవాడిని. 'అల్లూరి సీతారామరాజు' సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఆయన రోజుకు మూడు షిఫ్టులు పనిచేస్తూ వచ్చారు. 'అల్లూరి సీతారామరాజు' సినిమాను ఒకే కెమెరాతో ఒకే లెన్స్ తో చిత్రీకరించారు. అయినా ఇప్పటికీ ఆ సినిమాకి వంకబెట్టలేం" అన్నారు.
"మొదటి నుంచి కూడా తన సినిమాల లెక్కలకి సంబంధించిన విషయాల్లో అన్నయ్యకి మంచి అవగాహన ఉండేది. ఏ సినిమా ఎందుకు ఆడింది? .. ఎందుకు ఆడలేదు? ఎందుకు ఓపెనింగ్స్ పెరిగాయి? ఎందుకు తగ్గాయి? ఇలా ప్రతి విషయంలో ఆయనకంటూ అంచనాలు ఉండేవి. అన్నయ్యతో నాకు 70 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన లేకపోవడంతో ఒక్కసారిగా శూన్యమైపోయింది. ఆయన స్మారక మందిరాన్ని నిర్మించాలనే ఒక ఆలోచన ఉంది. దానికి సంబంధించిన నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటాము" అంటూ చెప్పుకొచ్చారు.