చివరి రోజుల్లో ప్రాణాంతక వ్యాధితో బాధ పడ్డ బ్రిటన్ రాణి

  • ఎలిజబెత్ 2కి బోన్ మ్యారో క్యాన్సర్ సోకిందని తాజాగా వెల్లడి
  • ఏడాది కాలం క్యాన్సర్ తో ఇబ్బంది పడ్డ బ్రిటన్ రాణి
  • సెప్టెంబర్ 8వ తేదీన కన్నుమూసిన ఎలిజబెత్2
క్వీన్ ఎలిజబెత్2 బ్రిటన్ కు అత్యధిక కాలం రాణిగా వ్యవహరించారు. 96 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో సెప్టెంబర్ 8న స్కాట్లాండ్‌లో మరణించారు. చనిపోయే ముందు చివరి రోజుల్లో ఆమె క్యాన్సర్ తో పోరాడినట్టు తెలిసింది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ స్నేహితుడు గైల్స్ బ్రాండ్రెత్ రాసిన జీవిత చరిత్రలో క్వీన్ ఎలిజబెత్ ఓ రకమైన బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్‌)తో పోరాడారని వెల్లడైంది. అయితే ఆమె మరణానికి ప్రధాన కారణం వృద్ధాప్యమే అని బ్రాండ్రెత్ పేర్కొన్నారు. 

‘రాణికి మైలోమా అనే బోన్ మ్యారో క్యాన్సర్ సోకిందని తెలిసింది. దాంతో, ఏడాది పాటు అలసట, బరువు తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డట్టు నేను విన్నాను’ అని పేర్కొన్నారు. మైలోమా క్యాన్సర్ సోకిన వాళ్లు ఎముకల నొప్పి, ముఖ్యంగా కటి దిగువ వీపులో నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతారు.  


More Telugu News