హీరోయిన్ రిచా వ్యవహారం.. అక్షయ్ కుమార్ పై ప్రకాశ్ రాజ్ సెటైరిక్ ట్వీట్
- సైన్యానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన రిచా చద్దా
- వాళ్లు ఉండబట్టే మనమంతా ఉన్నామన్న అక్షయ్ కుమార్
- మన దేశానికి సంబంధించి మీకంటే రిచానే ఎక్కువన్న ప్రకాశ్ రాజ్
భారత ఆర్మీని ఉద్దేశించి బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. సినీ ప్రముఖులు ఎవరికి వారు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా రిచాకు వ్యతిరేకంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించగా... ఆయనపై ప్రకాశ్ రాజ్ సెటైరిక్ గా ట్వీట్ చేశారు.
వివాదం వివరాల్లోకి వెళ్తే... పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని... గ్రీన్ సిగ్నల్ వస్తే ఆపరేషన్ ను పూర్తి చేసేస్తామని అన్నారు.
దీనికంటే ముందుగా... పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే తమ సమాధానం వేరుగా ఉంటుందని... తాము ఏం చేయబోతామనేది వారు కనీసం ఊహించలేరని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రిచా చద్దా స్పందిస్తూ... 'గాల్వాన్ సేస్ హాయ్' అని భారత సైన్యాన్ని కించపరిచేలా కామెంట్ చేసింది. దీంతో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
రిచా వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పారు. మన సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. వాళ్లు ఉండబట్టే మనమంతా ఉన్నామని చెప్పారు.
అక్షయ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సెటైరిక్ గా స్పందించారు. 'మీ నుంచి నేను ఇలాంటి స్పందనను ఊహించలేదు. ఈ దేశానికి సంబంధించి మీకంటే రిచానే ఇక్కడ ఎక్కువ సార్' అని ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ కు కెనడా సిటిజెన్ షిప్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కోణంలోనే ప్రకాశ్ రాజ్ స్పందించారు.