ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది శోధించిన సెలబ్రిటీ ఎవరంటే..!

  • మొదటి స్థానంలో అంబర్ హెర్డ్
  • ప్రతి నెలా 56 లక్షల మంది శోధన
  • రెండో స్థానంలో ఆమె భర్త జానీడెప్
  • తర్వాత స్థానంలో క్వీన్ ఎలిజబెత్ 2, ఎలాన్ మస్క్
పరువునష్టం దావాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన జంట అంబర్ హెర్డ్, జానీ డెప్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది వీరి గురించే తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2022 ఆధారంగా ఓ నివేదిక విడుదలైంది. ఈ ఏడాదిగాను ఎక్కువ మంది శోధించిన సెలబ్రిటీగా అంబర్ హెర్డ్ నిలిచింది. ఆ తర్వాత ఆమె మాజీ భర్త జానీ డెప్ రెండో స్థానంలో ఉన్నాడు. 

సగటున ప్రతి నెలా 56 లక్షల మంది అండర్ హెర్డ్ గురించి సెర్చ్ చేశారు. ఇక జానీ డెప్ గురించి నెలవారీ సెర్చ్ చేసిన వారి సంఖ్య 55 లక్షలుగా ఉంది. వీరి మధ్య పెద్ద వ్యత్యాసం కనిపించలేదు. అమెరికన్ రియాలిటీ షో సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్, ప్రపంచ సంపన్న వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ను వెనక్కి నెట్టేసి అంబర్ హెర్డ్ ముందు నిలవడం గమనార్హం.  

కిమ్, ఎలాన్ మస్క్, ఫుట్ బాలర్ టామ్ బ్రాడీ, నటుడు పెటే డేవిడ్సన్, క్వీన్ ఎలిజబెత్ 2 జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అంటే అంబర్, జానీ డెప్ తర్వాత ఎక్కువ మంది వీరి కోసం శోధించారు. క్విన్ ఎలిజబెత్ 2 గురించి తెలుసుకునేందుకు ప్రతి నెలా 43 లక్షల మంది గూగుల్ లో వెతికారు.


More Telugu News