కాన్పూరు కోతికి జీవిత ఖైదు!

  • ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘటన
  • మద్యం, మాంసం అలవాటు చేసి మృతి చెందిన మాంత్రికుడు
  • ఆ రెండింటి కోసం ప్రజలపై దాడి
  • ఐదేళ్లు చికిత్స అందించినా మారని వైనం
  • జీవితాంతం దానిని బందీగానే ఉంచాలని నిర్ణయం
మీరు విన్నది నిజమే. ఓ కోతికి జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్‌లో ఓ మాంత్రికుడి వద్ద కాలియా అనే పేరుగల కోతి ఉండేది. దానికి అతడు మద్యం, మాంసం అలవాటు చేశాడు. ఆ రెండింటికి అది బానిసగా మారిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాంత్రికుడు మృతి చెందాడు. దీంతో దాని ఆలనా పాలనా చూసేవారు కరవయ్యారు.

అయితే మద్యం, మాంసానికి అలవాటుపడిన ఆ మర్కటం అవి దొరక్కపోవడంతో అల్లాడిపోయింది. వాటి కోసం జనంపై దాడి చేసేది. అంతేకాకుండా మద్యం దుకాణం వద్ద కాపుకాసేది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని ఎత్తుకెళ్లేది. ఇలా 250 మందిపై దాడి చేసి గాయపరిచేది. దాని బాధలు భరించలేని స్థాయికి చేరుకోవడంతో 2017లో స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి దానిని పట్టుకుని జూలో బంధించారు. ఆ తర్వాత దానికి వైద్యం అందించారు. ఐదేళ్లపాటు దానికి వైద్యం అందించినా దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇకపై దానిని జూలోనే జీవితాంతం బందీగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.


More Telugu News