భక్తుల తలనీలాల ద్వారా వెంకన్నకు భారీ ఆదాయం
- తిరుమలలో స్వామివారికి తలనీలాల సమర్పణ
- మొక్కులు తీర్చుకునే భక్తులు
- తాజాగా 21 వేల కిలోల తలనీలాల వేలం
- స్వామివారికి రూ.47.92 కోట్ల రాబడి
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తుల తలనీలాల రూపంలో భారీ ఆదాయం లభించింది. దేశం నలుమూలల నుంచి తిరుమల వచ్చే భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారు. ఈ తలనీలాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏటా ఆన్ లైన్ లో వేలం వేస్తుంది. ఈ తలనీలాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ఈసారి టీటీడీ 21,100 కిలోల తలనీలాలను వేలంలో ఉంచగా, కళ్లు చెదిరే స్థాయిలో మొత్తం రూ.47.92 కోట్ల ధర పలికింది. వేలం వేసిన తలనీలాల్లో వివిధ సైజులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఈ తలనీలాలను గ్రేడింగ్ చేస్తారు.
ఫస్ట్ గ్రేడ్- 27 అంగుళాల తలనీలాలు
సెకండ్ గ్రేడ్- 19 నుంచి 26 అంగుళాలు
థర్డ్ గ్రేడ్- 10 నుంచి 18 అంగుళాలు
ఫోర్త్ గ్రేడ్- 5 నుంచి 9 అంగుళాలు
ఫిఫ్త్ గ్రేడ్- 5 అంగుళాల కంటే తక్కువ
వీటిని టీటీడీ వేలం సమయం వరకు ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విగ్గుల తయారీ కేంద్రాల్లో ఈ తలనీలాలను ఉపయోగిస్తారు.