నాగాలాండులో ‘బండ లాగుడు’ వేడుక.. ఇదిగో వీడియో!

  • ట్విట్టర్ లో షేర్ చేసిన నాగాలాండ్ గిరిజన మంత్రి తెంజెమిన్
  • భారీ బండరాయిని లాగుతున్న వందలాది మంది గిరిజనులు
  • ఉత్సాహంగా స్పందిస్తున్న నెటిజన్లు
నాగాలాండ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ తెంజెన్ ఇమ్నా అలాంగ్ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. నాగాలాండ్ సంస్కృతిని ఇతర ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెంజెమిన్ తరచూ ఆసక్తికరమైన విషయాలను, వీడియోలను ట్వీట్స్ చేస్తుంటారు. నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను తెలియజేసే వీడియోలతో.. ఆ రాష్ట్రానికి మరింత మంది పర్యాటకులను ఆకర్షించడమే ఆయన లక్ష్యం అని అనుకోవాలి.

ఈ క్రమంలో తెంజెమిన్ తాజాగా ‘స్టోన్ పుల్లింగ్’ వేడుక వీడియోను షేర్ చేశారు. ఇందులో సంప్రదాయ వస్త్రధారణతో ఉన్న వందలాది మంది అంగామి నాగ తెగకు చెందిన వారు భారీ బండరాయికి తాడు కట్టి లాగుతూ వెళ్లడాన్ని చూడొచ్చు. దేశవ్యాప్తంగా చాలా గ్రామాలకు ఇలాంటి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈశాన్య రాష్ట్రాల గురించి మిగిలిన దేశానికి చెప్పడం బాగుందని మరో యూజర్ పేర్కొన్నాడు.


More Telugu News