చైనాలో మళ్లీ భారీగా నమోదవుతున్న కరోనా కేసులు

  • నిన్న ఒక్కరోజే 31,454 కేసుల నమోదు
  • కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఇదే
  • కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు విధిస్తున్న చైనా
చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎన్నడూ లేనంతగా నిన్న కొత్త కేసులు నమోదుకావడం కలవరపాటుకు గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517 కేసులు అసింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. అయితే చైనా జనాభా (140 కోట్లు)తో పోల్చితే ఈ కేసుల సంఖ్య తక్కువే అంటున్నారు. 

మరోవైపు తొలి నుంచి కూడా కరోనా నేపథ్యంలో చైనా కఠినమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఒక చిన్న ఔట్ బ్రేక్ వచ్చినా ఆ నగరం మొత్తాన్ని షట్ డౌన్ చేసేస్తోంది. కరోనా రోగులను, వారికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని కఠినంగా క్వారంటైన్ చేస్తోంది. షాంఘైలో కఠినమైన ఆంక్షలు విధించడంతో ఆహారం కొరతతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


More Telugu News