పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు?: సీపీఐ నారాయణ

  • పొత్తులపై నారాయణ కీలక వ్యాఖ్యలు
  • మోదీతో భేటీ తర్వాత పవన్ మౌనంగా మారిపోయారని విమర్శ
  • మోదీ, జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టం ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన, వామపక్షపార్టీలు కలిసి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. అలా ముందుకెళ్తేనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని నారాయణ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన పవన్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. మోదీ జగన్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే మూడు పార్టీలు కలిసి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని నారాయణ పేర్కొన్నారు.


More Telugu News