హెల్త్ ఇన్సూరెన్స్ తో రెండు ప్రయోజనాలు
- ఆసుపత్రిలో చికిత్స అవసరమైతే ఆదుకుంటుంది
- ఆదాయపన్ను పరంగానూ చక్కని ప్రయోజనాలు
- 60 ఏళ్లలోపు వారికి రూ.25వేల వరకు..
- 60 దాటితే రూ.50వేల వరకు పన్ను మిహాయింపు
ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) వల్ల ప్రయోజనాలపై దేశ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఆసుపత్రిలో చేరిన వారు చికిత్స కోసం రూ.లక్షల్లో బిల్లులు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇది చాలా మంది దృక్పథంలో మార్పును తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవారు పెరిగారు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అత్యవసర పరిస్థితులు, అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చుల భారం మనపై పడదు. ఆర్థికంగా కుదేలు కాకుండా హెల్త్ ప్లాన్ రక్షిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి. దీనికి ఆదాయపన్ను ప్రయోజనం కూడా ఉంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు.
ఒక వ్యక్తి తన పేరిట, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం ఒక ఏడాదికి రూ.25,000 వరకు చెల్లించే ప్రీమియంపై పన్ను లేదు. 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ ప్రయోజనం. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేల కంటే తక్కువే ఉంటే, అప్పుడు ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని చూపించుకోవచ్చు. ఇక 60 ఏళ్లు నిండిన వారు అయితే ఒక ఏడాదిలో హెల్త్ ప్రీమియం రూ.50,000 మొత్తంపై ఆదాయపన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల పేరిట పిల్లలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నా, ఈ క్లెయిమ్ కు అర్హులే.
కొన్ని షరతులు
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవాలని అనుకునే వారు ఆన్ లైన్ విధానంలోనే ప్రీమియం చెల్లించాలి. నగదు రూపంలో చెల్లిస్తే ఈ ప్రయోజనం అందదు. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు నగదు రూపంలో చెల్లించినా క్లెయిమ్ కు అర్హత లభిస్తుంది. ఒకవేళ ఒకేసారి రెండు, మూడు సంవత్సరాలకు ప్రీమియం చెల్లించారనుకోండి. అప్పుడు దాన్ని మూడేళ్లకు వేరు చేసి, మూడు సంవత్సరాల్లోనూ ఒక్కో భాగం చొప్పున క్లెయిమ్ చేసుకోవచ్చు.