మంత్రి మల్లారెడ్డి కొడుకు ఆసుపత్రిలో చేరడంపై రఘునందన్ రావు సెటైర్లు

  • మహేందర్ రెడ్డి నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారన్న రఘునందన్
  • ఐటీ రెయిడ్స్ ప్రారంభం కాగానే గుండెపోటు ఎలా వస్తుందని ప్రశ్న
  • తప్పులు చేయకపోతే మల్లారెడ్డి ఫోన్ ఎందుకు దాచారన్న రఘు
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరారు. మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్న తరుణంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చేరడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సెటైర్లు వేశారు. ఐటీ దాడులు జరిపినప్పుడల్లా గుండెపోటు వచ్చిందని అందరూ ఆసుపత్రుల్లో చేరుతుంటారని... ఇది సాధారణ విషయమేనని చెప్పారు. 

మహేందర్ రెడ్డి నిన్న ఉదయం కూడా వాకింగ్ చేశారని... ఐటీ రెయిడ్స్ ప్రారంభం కాగానే ఆయనకు గుండెపోటు ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి తన ఫోన్ ను దాచి పెట్టారని... అయినా ఐటీ అధికారులు ఆ ఫోన్ ను కనిపెట్టారని చెప్పారు. తప్పులు చేయకపోతే ఫోన్ దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని... దీనిపై ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు.


More Telugu News