కొడుకుని చూడకుండా మల్లారెడ్డిని అడ్డుకున్న ఐటీ అధికారులు.. ఆసుపత్రి వద్ద బైఠాయించిన మంత్రి
- మల్లారెడ్డితో పాటు ఆసుపత్రికి వచ్చిన ఐటీ అధికారులు
- ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు
- సీఆర్పీఎఫ్ సిబ్బందితో తన కొడుకు ఛాతీపై కొట్టించారన్న మల్లారెడ్డి
ఛాతీ నొప్పితో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో, తన కొడుకును చూసేందుకు మల్లారెడ్డి ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఐటీ అధికారులు కూడా ఆసుపత్రికి వచ్చారు. అయితే, కుమారుడిని చూడ్డానికి మల్లారెడ్డిని అధికారులు అనుమతించలేదు. ఐటీ అధికారుల తీరును నిరసిస్తూ ఆయన ఆసుపత్రి ముందు బైఠాయించారు.
మరోవైపు ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, తన కుమారుడు ఆసుపత్రిలో చేరాడనే విషయాన్ని పొద్దున టీవీలో చూసి ఆసుపత్రికి వచ్చానని చెప్పారు. తన కొడుకును కూడకుండా ఐటీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో తన కుమారుడి ఛాతిపై రాత్రి కొట్టించారని... అందుకే ఆయనకు ఛాతినొప్పి వచ్చిందని ఆరోపించారు.