బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇలా ఉంటుంది... రూ. 16 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లు వసూలు చేసింది!
- పాన్ ఇండియా లెవెల్లో దుమ్మురేపిన 'కాంతార'
- మరో 3 కోట్లు సాధిస్తే కన్నడలో 'కేజీఎఫ్-2' రికార్డు బద్దలు
- రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న చిత్రం
బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఏంటో, బాక్సాఫీస్ ను షేక్ చేయడం అంటే ఏంటో కన్నడ చిత్రం 'కాంతార' నిరూపించింది. ఈ సినిమాను వందల కోట్లు పెట్టి తీయలేదు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. రూ. 400 కోట్ల వసూళ్లను సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందంటే... ప్రేక్షకులను ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్థమవుతుంది.
కన్నడలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 168.50 కోట్లను వసూలు చేసింది. మరో రూ. 3 కోట్లను సాధిస్తే 'కేజీఎఫ్-2' రికార్డును బ్రేక్ చేస్తుంది. 'కేజీఎఫ్' సినిమా కన్నడలో రూ. 171.50 కోట్లను వసూలు చేసింది. 'కాంతార' చిత్రాన్ని రిషబ్ శెట్టి నటిస్తూ, తానే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించింది. నవంబర్ 24 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రం మరెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.