గాయని మంగ్లీకి సలహాదారు పదవిని ఇచ్చిన జగన్

  • ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ నియామకం
  • రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న మంగ్లీ
  • నెలకు రూ. లక్ష వేతనం
ప్రముఖ సినీ గాయని మంగ్లీకి ఏపీ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ఆమెను ముఖ్యమంత్రి జగన్ నియమించారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె ఉంటారు. ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు రూ. లక్ష వేతనం అందుతుంది. 

మరోవైపు ఆమెను ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ లో కెరీర్ ను ప్రారంభించిన మంగ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు.


More Telugu News