అమెజాన్ ప్రైమ్ లో 'వధంది' .. ఉత్కంఠను రేపుతున్న ట్రైలర్!

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'వధంది' వెబ్ సిరీస్ 
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ
  • ప్రధాన పాత్రను పోషించిన ఎస్.జె.సూర్య 
  • డిసెంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైన వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందే వెబ్ సిరీస్ లను యూత్ ఎక్కువగా ఇష్టపడుతోంది. అందువలన ఆ తరహా కథలు ఎక్కువగా రంగంలోకి దిగుతున్నాయి. అలా అమెజాన్ ప్రైమ్ ద్వారా మరో వెబ్ సిరీస్ గా 'వధంది' పలకరించనుంది. వాల్ వాచర్ బ్యానర్ పై నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కి పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు.  

ఎస్.జె. సూర్య - లైలా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక ఫారెస్టు ప్రాంతంలో ఒక యువతి హత్య జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆ కేసు విచారణను ఎస్. జె. సూర్య చేపడతాడు. 

ఆ యువతి తెలిసినవారితో ఆ ప్రాంతానికి వచ్చిందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వచ్చి చంపారా? అనే సందేహం ఆ పోలీస్ ఆఫీసర్ కి కలుగుతుంది. దాంతో ఆయన ఆ యువతితో పరిచయం ఉన్నవారందరిని పిలిపించి ఆరాతీయడం మొదలుపెడతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. 'విక్రమ్ వేద' డైరెక్టర్స్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడం వలన సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది.


More Telugu News