భార్యకు విడాకులు ఇస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందన
- ఊహ, శ్రీకాంత్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం
- ఇలాంటి పనికి మాలిన వార్తలు ఎవరు పుట్టిస్తున్నారని మండిపడ్డ శ్రీకాంత్
- చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరిన వైనం
సినీ నటుడు శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందిస్తూ, ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఇలాంటి పనికిమాలిన వార్తలు ఎవరు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను చనిపోయినట్టు గతంలో ఒక పుకారు పుట్టించారని... ఆ వార్తను చూసి తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని చెప్పారు.
ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము విడాకులు తీసుకుంటున్నామని కొత్త పుకారు పుట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను ఊహకు నా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశారని... ఆమె కంగారు పడుతూ ఆ పోస్టులను తనకు చూపించిందని చెప్పారు. ఇలాంటివి చూసి ఆందోళన చెందొద్దని ఊహను తాను ఓదార్చానని తెలిపారు.
తాను, ఊహ చెన్నైకు వచ్చి, ఇక్కడి నుంచి దైవ దర్శనానికి అరుణాచలంకు వెళ్తున్నామని... ఇలాంటి తరుణంలో ఇలాంటి తప్పుడు వార్తలు తమ కుటుంబానికి చాలా చికాకును తెప్పిస్తున్నాయని శ్రీకాంత్ అన్నారు. ఈ తప్పుడు వార్త మరింత ప్రచారం కాకుండా ఆపేందుకు ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నానని చెప్పారు. కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు తన మీదనే కాకుండా, చాలా మంది ప్రముఖుల మీద నిరాధారమైన పుకార్లను ప్రచారం చేస్తున్నాయని.... వీరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.