నేపియర్ లో టాస్ ఓడిన టీమిండియా
- భారత్, కివీస్ మధ్య మూడో టీ20
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- కాన్వే, ఫిలిప్స్ అర్ధసెంచరీలు
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 నేపియర్ లో జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 135 పరుగులు చేసింది.
ఓపెనర్ డెవాన్ కాన్వే (54 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓపెనర్ ఫిన్ అలెన్ (3), మార్క్ చాప్ మన్ (12) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 2, అర్షదీప్ ఒక వికెట్ తీశారు.
ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్షణం కాగా, రెండో టీ20లో టీమిండియా గెలిచింది. నేటి మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే 1-1తో సిరీస్ సమం అవుతుంది.