వన్ ప్లస్ ఫోన్ ధర రూ.15వేల లోపే.. ఫ్లిప్ కార్ట్ లో లభ్యం!
- ఫ్లిప్ కార్ట్ లో నార్డ్ ఎన్20 ఎస్ఈ విక్రయాలు
- 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ఒక్కటే అందుబాటు
- ధర రూ.14,799
- ఫెడరల్ బ్యాంకు కార్డుపై రూ.1,500 తగ్గింపు
ఒకప్పుడు వన్ ప్లస్ ఫోన్ కొనుగోలు చేయాలంటే రూ.30వేలకు పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ, కాలం మారింది. వన్ ప్లస్ దిగొచ్చింది. బడ్జెట్ ధరకే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా వన్ ప్లస్ నార్డ్ ఎన్20ఎస్ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్ల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ పోర్టల్ పై ఈ మోడల్ దర్శనమిస్తోంది.
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.14,799. ఫెడరల్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే మరో రూ.1,500 తగ్గుతుంది. దీంతో రూ.13,299కే సొంతం చేసుకోవచ్చు. పీఎన్ బీ క్రెడిట్ కార్డుపై రూ.1,250 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సెలెస్టియల్ బ్లాక్, బ్లూ ఒయాసిస్ రంగుల్లో లభిస్తోంది.
6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ తో ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ35 ఎస్ వోసీ పై పనిచేస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ తో మొత్తం రెండు కెమెరాల సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది.