బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు .. శ్రీహాన్ షాక్!
- నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ
- శ్రీహాన్ కి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు
- రాజ్ ని భయపెట్టిన శ్రీ సత్య - ఫైమా
బిగ్ బాస్ హౌస్ లో నిన్న నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. హౌస్ లోని సభ్యులందరినీ ఒక్కొక్కరిగా ప్రత్యేకమైన రూమ్ కి పిలిచిన బిగ్ బాస్, తమకి నచ్చని ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలను షెట్టర్ లో వేసి, వారు ఎందుకు నచ్చలేదనే రీజన్ చెప్పమని అడిగారు. దాంతో ఎవరికి వారు తమకి నచ్చని ఇద్దరు ఇంటి సభ్యులను గురించి .. అందుకుగల కారణాలను గురించి చెబుతూ వెళ్లారు.
రేవంత్ కెప్టెన్ కావడం వలన, ఆయనకి నామినేషన్ల నుంచి మినహాయింపు లభించింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో లేని ఇంటి సభ్యురాలు ఒక్క కీర్తి మాత్రమే. ఆమెకి వ్యతిరేకంగా ఎవరూ చెప్పలేదు ... నామినేట్ చేయలేదు. ఇక మిగతా వాళ్లంతా నామినేషన్స్ లో ఉన్నారు. అయితే అందరికంటే ఎక్కువ నామినేషన్లు శ్రీహన్ కి పడినట్టుగా బిగ్ బాస్ ప్రకటించడంతో అతను షాక్ అయ్యాడు. తనపై అంతగా ఎందుకు పగబట్టారంటూ ఫీలయ్యాడు.
నామినేషన్స్ పరంగా శ్రీహాన్ తరువాత స్థానంలో రోహిత్ .. ఫైమా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో రాజ్ .. శ్రీ సత్య .. ఇనయా .. ఆది రెడ్డి ఉన్నారు. ఇక వీరిలో ఆదివారం రోజున ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాజ్ కి దెయ్యాలంటే భయమని మొన్న నాగార్జునకి ఇంటి సభ్యులు చెప్పినప్పుడు, ఆ వేషాలు వేసి అతణ్ణి భయపెట్టమని అన్నారు. దాంతో శ్రీసత్య - ఫైమా దెయ్యాల వేషాలు వేసి అతణ్ణి భయపెట్టడానికి ప్రయత్నించి నవ్వులు పూయించారు.