ఒక నిర్మాతగా ఇంతకంటే పొందే లాభం ఏముంటుంది?: నాని
- నాని నిర్మాతగా రూపొందిన 'మీట్ క్యూట్'
- 5 కథలతో నడిచే వెబ్ సిరీస్ ఇది
- రచయితగా, దర్శకురాలిగా నాని సోదరి ఎంట్రీ
- ఈ నెల 25వ తేదీ నుంచి 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్
నాని హీరోగా ఒక వైపున వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతూనే, మరో వైపున తన సొంత బ్యానర్లో ఇతర హీరోలతో సినిమాలు .. వెబ్ సిరీస్ లు చేస్తూ వెళుతున్నాడు. ఆయన బ్యానర్ లో రూపొందిన వెబ్ సిరీస్ పేరే 'మీట్ క్యూట్'. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను 'సోని లివ్' సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటును నిన్న రాత్రి నిర్వహించారు.
ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "నాకు సంబంధించిన మీట్ క్యూట్ మూమెంట్ ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ రైటర్ .. డైరెక్టర్ మా అక్కయ్య కావడమే. నా గురించి చాలా ఏళ్లుగా మా అమ్మానాన్నలు వింటూనే వస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మా అక్కయ్య కోసమే మా అమ్మా నాన్నలు చూస్తూ ఉంటారు. మీ అందరి మాటలు విని మా అమ్మ కడుపు నిండిపోయి ఉంటుంది. ఒక నిర్మాతగా అంతకు మించిన లాభం ఏం ఉంటుంది?" అన్నాడు.
"ఈ వెబ్ సిరీస్ లో 5 కథలు ఉంటాయి. ఏ కథ ద్వారా ఎవరికీ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ప్రతి కథ చూసిన తరువాత ఆలోచింపజేస్తుంది. ప్రతి కథలోని ప్రతి అంశం కనెక్ట్ అవుతుంది. విజయ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలలో వారు ఒదిగిపోయి, కథను ప్రేక్షకుల మనసులకు దగ్గరగా తీసుకుని వెళతారు. ఈ వెబ్ సిరీస్ ను అంతా సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.