ఫస్టు మూవీ సమయంలో విజయ్ ఏడ్చేవాడు: శ్రీలేఖ

  • చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలేఖ
  • ఆమె ఫస్టు మూవీ హీరో విజయ్ 
  • ఆయన తండ్రి చంద్రశేఖర్ ఆ సినిమా డైరెక్టర్ 
  • అప్పట్లో విజయ్ కి యాక్టింగ్ ఇష్టం ఉండేది కాదన్న శ్రీలేఖ
టాలీవుడ్ లోకి చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ అడుగుపెట్టారు. 'తాజ్ మహాల్' .. ' ధర్మచక్రం' .. 'శివయ్య'  .. 'ప్రేమించు' వంటి సినిమాలకి ఆమె అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక సింగర్ గా కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.  తాజా ఇంటర్వ్యూలో శ్రీలేఖ మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

దర్శక నిర్మాతల అభిరుచిని .. కథలోని పాత్రల స్వభావాన్ని .. సందర్భాన్ని బట్టి నా మార్కు బాణీలను చేస్తూ వచ్చాను. 1992లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన సినిమాకు నేను ఫస్టు టైమ్ సంగీతాన్ని సమకూర్చాను. మణిమేఖల పేరుతో కోలీవుడ్ కి పరిచయమయ్యాను. ఆ సినిమా దర్శకుడు ఎవరో కాదు హీరో విజయ్ వాళ్ల ఫాదర్. 

విజయ్ ను హీరోను చేయాలనేది చంద్రశేఖర్ గారి డ్రీమ్. అమెరికాలో చదువుకుంటున్న విజయ్ ని తీసుకుని వచ్చారు. విజయ్ ఏజ్ .. నా ఏజ్ ఒకటే కావడం వలన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం లేదనీ .. చదువుకుంటానని రోజూ నా దగ్గర విజయ్ ఏడ్చేవాడు. ఈ విషయాన్ని వాళ్ల ఫాదర్ తో చెప్పమని అనేవాడు. అంత పెద్ద సినిమాకి నేను చేయగలనా? అనే టెన్షన్ లో నేను ఉండేదానిని" అంటూ నవ్వేశారు.


More Telugu News