ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

  • రిమాండ్ ను సవాల్ చేస్తూ సుప్రీంలో రామచంద్ర భారతి పిటిషన్
  • పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచన
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు విధించిన రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్ర భారతి వేసిన పిటిషన్ ను కొట్టేసింది. ట్రయల్ కోర్టు విధించిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. తమపై ఉన్న కేసును కొట్టివేయాలని నిందితులు రామచంద్ర భారతితో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను ప్రలోభ పెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.


More Telugu News