ఇండోనేషియాలో భూకంపం... 44 మంది మృతి
- జావా ద్వీపాన్ని కుదిపేసిన భూకంపం
- రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత
- సియాంజుర్ పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం
- 300కి పైగా క్షతగాత్రులు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఇండోనేషియా ప్రధాన ద్వీపం జావాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి 44 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. జావా పశ్చిమ ప్రాంత పట్టణం సియాంజుర్ కు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
భూకంపం ప్రభావంతో సియాంజుర్ లో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన అనేకమందిని బయటికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. భూకంపం ప్రభావంతో ఇక్కడికి దూరంలో ఉన్న రాజధాని జకార్తాలో సముద్రపు అలలు ఎగసిపడ్డాయి.