చిరంజీవి విలక్షణమైన నటుడు: ప్రధాని మోదీ
- గోవాలో ఇఫీ చలనచిత్రోత్సవం ప్రారంభం
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా చిరంజీవి
- అభినందించిన ప్రధాని మోదీ
- కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
ఇఫీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారం ప్రకటించడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
చిరంజీవి విలక్షణమైన నటుడు అని కొనియాడారు. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారని వివరించారు. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారని కితాబునిచ్చారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంటున్నందుకు చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు.
కాగా, ప్రధాని మోదీ అభినందనల పట్ల చిరంజీవి బదులిచ్చారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ అభినందనలను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రశంసాపూర్వకమైన మీ మాటలు సంతోషదాయకం అని పేర్కొన్నారు.