ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం... కర్ణాటకలోని చిక్కమగళూరులో ఘటన
- ఏనుగు దాడిలో చనిపోయిన మహిళ మృతదేహంతో గ్రామస్థుల నిరసన
- ఆదివారం సాయంత్రం బాధితుల పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే కుమారస్వామి
- ఇంత ఆలస్యంగా స్పందించడమేంటని మండిపడ్డ గ్రామస్థులు
- వాదన పెరగడంతో ఎమ్మెల్యేను వెంటపడి తరిమిన వైనం
ఏనుగు దాడిలో జనం ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆగ్రహించారు. మృతదేహంతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. అయితే, ఇంత ఆలస్యంగా రావడమేంటని మండిపడ్డ జనం.. సదరు ఎమ్మెల్యేను తరిమి కొట్టారు. పోలీసులు కల్పించుకుని అతికష్టం మీద ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడారు. కర్ణాటకలోని చిక్కమగళూరులో చోటుచేసుకుందీ ఘటన.
చిక్కమగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవల ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. తరచుగా ఏనుగుల బారిన పడి జనం చనిపోతున్నరు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఆదివారం మరో మహిళపై ఏనుగు దాడి చేసి చంపేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మృతదేహంతో ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎంపీ కుమార స్వామి గ్రామానికి వచ్చారు. అయితే, జనం చనిపోతున్నా పట్టించుకోరా..? మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే, తీరిగ్గా సాయంత్రానికి వస్తారా అని జనం ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో మాటా మాటా పెరిగింది. రెచ్చిపోయిన జనం సదరు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊళ్లో నుంచి తరిమి కొట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి, అక్కడి నుంచి తరలించారు.