కొండల్లో .. కోనల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం: అల్లరి నరేశ్
- అల్లరి నరేశ్ నుంచి 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
- కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- కామెడీ .. ఎమోషన్స్ ప్రధానంగా నడుస్తుందన్న నరేశ్
- ఈ నెల 25వ తేదీన సినిమా రిలీజ్
అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్. మోహన్ దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా ఆనంది అలరించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు.
ఈ వేదికపై అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో 90 శాతం కథ అడవిలోనే జరుగుతుంది. 55 రోజుల్లో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. అబ్బూరి రవిగారు ఈ సినిమాకి మాటలు రాశారు. మారేడుమిల్లి ఫారెస్టు ప్రాంతంలోని వారి యాసను పట్టుకుని, అందుకు తగినట్టుగా డైలాగ్స్ రాయడానికి ఆయన చాలా కష్టపడ్డారు.
ఇక దర్శక నిర్మాతలిద్దరూ ఈ సినిమాతోనే పరిచయమవుతున్నారు. ఇద్దరికీ కూడా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా కోసం 250 మంది ఎంతో కష్టపడ్డారు. కొండలు ఎక్కడానికి 3 గంటలు .. దిగడానికి 3 గంటలు పట్టేది. అది అనుకున్నంత తేలికేం కాదు. ఈ సినిమా చాలా సీరియస్ గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులో 40 శాతం కామెడీ ఉంటుంది. మిగతా 60 శాతం ఎమోషన్ తో నడుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.