సిక్సులే కాదు .. డకౌట్స్ కూడా చూశాను: కృష్ణవంశీ
- 'గులాబీ'తో డైరెక్టర్ గా కృష్ణవంశీ ఎంట్రీ
- విభిన్నమైన సినిమాలతో భారీ హిట్లు
- క్రియేటివ్ డైరెక్టర్ గా దక్కిన పేరు
- తన గొప్పేం లేదంటూ తేల్చేసిన కృష్ణవంశీ
కృష్ణవంశీ పేరు వినగానే ఆయన నుంచి వచ్చిన 'గులాబీ' .. 'నిన్నే పెళ్లాడుతా' .. 'సిందూరం' .. 'అంతఃపురం' .. 'ఖడ్గం' వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి. ఆ సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి భారీ విజయాలను `సాధించాయి. అలాంటి గొప్ప సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ, తాజా ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సమాధానాలిస్తూ వెళ్లారు.
"నా సినిమాల్లో ఏది బెస్టు అంటే నేను చెప్పలేను. కెరియర్ ఆరంభంలో హిట్ వస్తే గర్వంగా ఉండేది. ఆ తరువాత మనదేమీ లేదు అనే విషయం అర్థమైంది. ఇంకొంత కాలం పోయిన తరువాత, ఆ సమయానికి అలా జరిగింది అంతే అనిపించింది. అందమైన అమ్మాయి కనిపించినప్పుడు, 'బాపుగారి బొమ్మలా ఉంది .. కృష్ణవంశీ సినిమాల్లోకి హీరోయిన్ లా ఉంది' అని అనుకుంటారని మీరు చెబుతున్నారు. బాపు గారు లెజండరీ డైరెక్టర్, ఆయనతో పోలికను నేను తీసుకోలేను" అన్నారు.
ఇక నా సినిమాల్లో ఏ హీరోయిన్ ను కూడా నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందంగా చూపించినదేం లేదు. నిజంగానే వాళ్లు అందగత్తెలు .. కెమెరా మెన్స్ తమదైన స్టైల్లో వాళ్లని చూపించారంతే. కృష్ణవంశీ వరుస సిక్సులు కొట్టారని మీరు అంటున్నారు. అలాంటిదేమి లేదు. నేను సిక్సులు మాత్రమే కాదు .. డకౌట్స్ కూడా చూశాను" అంటూ చెప్పుకొచ్చారు.