బీటెక్ అర్హతతో భెల్ లో ఉద్యోగాలు.. మచిలీపట్నం యూనిట్ లో ఖాళీలు

  • ఎంపికైతే నెలకు రూ.55 వేల జీతం
  • సెకండ్ క్లాస్ లో పాసయినా దరఖాస్తు చేసుకోవచ్చు
  • అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం
  • నోటిఫికేషన్ విడుదల చేసిన భెల్
భారత మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం యూనిట్ లో ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. 37 ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలని పేర్కొంది. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది.

అభ్యర్థుల వయసు 1 అక్టోబర్ 2022 నాటికి 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.177, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.472 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు:
ప్రాజెక్ట్‌ ఇంజనీర్లకు.. మొదటి ఏడాది నెలకు రూ.40,000లు, రెండో ఏడాది నెలకు రూ.45,000లు, మూడో ఏడాది నెలకు రూ.50,000లు, నాలుడో ఏడాది నెలకు రూ.55,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ట్రైనీ ఇంజనీర్లకు.. మొదటి ఏడాది నెలకు రూ.30,000లు, రెండో ఏడాది నెలకు రూ.35,000లు, మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీలు..
ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు: 7, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌) పోస్టులు: 7, ట్రైనీ ఇంజనీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు: 11, ట్రైనీ ఇంజనీర్‌ (మెకానికల్‌) పోస్టులు: 10, ట్రైనీ ఇంజనీర్‌ (కంప్యూటర్‌ సైన్స్) పోస్టులు: 2


More Telugu News