ఆదిరెడ్డి .. నీ తీరు మార్చుకో: నాగార్జున వార్నింగ్

  • శనివారం రోజున వేడెక్కిన 'బిగ్ బాస్ హౌస్'
  • రేవంత్ ను సున్నితంగా మందలించిన నాగ్ 
  • ఆదిరెడ్డికి ఒక రేంజ్ లో క్లాస్ తీసుకున్న నాగ్ 
  • ఆటలు తగ్గి మాటలు పెరిగాయంటూ హెచ్చరిక
నిన్న శనివారం రోజున 'బిగ్ బాస్' 76వ రోజులోకి అడుగుపెట్టాడు. నాగార్జున కాస్త సీరియస్ గా కనిపించడం .. హౌస్ లోని పోటీదారుల ప్రవర్తన పట్ల అసహనాన్ని ప్రదర్శించడం జరిగింది. కెప్టెన్సీ అనేది ఒక బాధ్యత అనీ .. అది ఒక అధికారంగా భావించి, దానిని ఇతరులపై ప్రదర్శించడం కరెక్టు కాదని ఆయన సున్నితంగా రేవంత్ ను మందలించారు. రేవంత్ .. శ్రీహాన్ .. రాజ్ ఆటతీరును మెచ్చుకున్న నాగార్జున, ఆ తరువాత ఆదిరెడ్డిపై దృష్టి పెట్టారు. 

ఆదిరెడ్డి గురించి నాగార్జున ప్రస్తావిస్తూ, 'గట్టుమీద దాసు' అనే ఒక కథ చెప్పారు. ఆదిరెడ్డి ఆటతీరు అలాగే ఉందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్ ను ఆదిరెడ్డి ఆడకపోవడం .. తనకి ఆడియన్స్ ఇచ్చే ఓట్లు సరిపోతాయని అనడం .. తన మాట తప్పయితే హౌస్ నుంచి వెళ్లిపోతానని తరచూ అంటుండటం .. 'బిగ్ బాస్'నే ఎలిమినేట్ చేస్తానని మాట్లాడటం కరెక్టు కాదంటూ మండిపడ్డారు. 

" ఆదిరెడ్డి .. ఆట ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వెవరు? గేమ్ తీరును తప్పుబట్టడానికి నువ్వెవరు? నువ్వు బిగ్ బాస్ నే ఎలిమినేట్ చేసేంత తోపు .. తురుము అయ్యావా? ఆదిరెడ్డి నీ తీర్చు మార్చుకో .. లేదంటే బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయమని నువ్వు చెప్పడం కాదు, ఆడియన్స్ వచ్చి నిన్ను తీసుకుని వెళ్లిపోతారు. ఇక్కడ గెలుపు .. ఓటమి ముఖ్యం కాదు, ప్రయత్నం చేశావా లేదా అనేది చూస్తాము. ఇక ఆటలు ఆడు .. మాటలు తగ్గించు" అంటూ సీరియస్ అయ్యారు..


More Telugu News