కారులో తిప్పుతూ మోడల్‌పై సామూహిక అత్యాచారం
- కేరళలోని కొచ్చిలో ఘటన
- స్నేహితురాలితో కలిసి పబ్‌కు వెళ్లిన మోడల్
- మద్యం తాగి స్పృహ తప్పి పడిపోవడంతో రంగంలోకి యువకులు
- ఇంటి వద్ద దిగబెడతామని తీసుకెళ్లి అత్యాచారం
- నిందితులకు సాయం చేసిన బాధిత యువతి స్నేహితురాలు
మద్యం మత్తులో ఉన్న 19 ఏళ్ల మోడల్‌ను కొందరు యువకులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళలోని కొచ్చిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మోడల్ గురువారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి నగరంలోని షిప్‌యార్ట్ సమీపంలో ఉన్న పబ్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
అక్కడే ఉన్న ముగ్గురు యువకులు అది చూసి ఆమె స్నేహితురాలి వద్దకు వెళ్లారు. ఆమెను ఇంటి వద్ద వదిలిపెడతామని చెప్పి కారులో తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన వారు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కక్కనాడ్‌లోని ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె తన మరో స్నేహితురాలితో జరిగిన విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి స్నేహితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ప్రస్తుతం కలామసెరీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. నిందితులు మొత్తం నలుగురని, వారిలో బాధిత యువతి స్నేహితురాలు కూడా ఉందని పోలీసులు తెలిపారు. నిందితులకు ఆమె సాయం చేసిందన్నారు. ఆమెపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాధితురాలికి డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.