తన ఫాంహౌస్ లో కేదార్ జాదవ్ కు ఆతిథ్యమిచ్చిన ధోనీ
- రాంచీలో వ్యవసాయం చేస్తున్న ధోనీ
- 10 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం
- ఆర్గానిక్ సేద్యంపై ధోనీ ఆసక్తి
- జాదవ్ కు వ్యవసాయ క్షేత్రం మొత్తం చూపించిన మాజీ సారథి
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. విరామ సమయం ఎక్కువగా ఉండడంతో ధోనీ ఇతర వ్యాపకాల వైపు మొగ్గాడు. రాంచీ పరిసరాల్లోని తన వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలు పండిస్తూ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ధోనీ ఫాంలో పండిన కూరగాయలను యూఏఈకి ఎగుమతి చేసేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోంది.
ఇక ధోనీ యాడ్స్ లోనూ నటిస్తుండడం తెలిసిందే. యాడ్స్ కు సంబంధించిన కార్యక్రమాలేవీ లేకపోతే ధోనీ ఉండేది వ్యవసాయక్షేత్రంలోనే. ధోనీ తాజాగా తన ఫాంహౌస్ కు మహారాష్ట్ర క్రికెటర్ కేదార్ జాదవ్ ను ఆహ్వానించాడు. జాదవ్ కు తన ఫాంహౌస్ మొత్తం చూపించాడు. తాను చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయాన్ని జాదవ్ కు వివరించాడు.
ధోనీకి రాంచీ సమీపంలోని బరిదీ ప్రాంతంలో 10 ఎకరాల సువిశాల వ్యవసాయక్షేత్రం ఉంది. ధోనీ ఇక్కడ కొన్ని గుర్రాలను కూడా పెంచుతున్నాడు. సునేహారీ అనే గుర్రం వద్ద ధోనీ, జాదవ్ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను జాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మహి భాయ్ ఫాంహౌస్ లో ఓ రోజంతా గడిపానని జాదవ్ వెల్లడించాడు.
అంతకుముందు, శుక్రవారం సాయంత్రం ధోనీ... కేదార్ జాదవ్, మహారాష్ట్రకే చెందిన మరో క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ లతో కలిసి రాంచీ రోడ్లపై కారులో షికారు చేశాడు.