రండి కొట్టుకుందాం అని చంద్రబాబు అనడం సరికాదు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- కర్నూలులో వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్
- మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్
- స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- చంద్రబాబు ఒక పిచ్చివాడు అని వ్యాఖ్యలు
- చొక్కా చించుకుని రోడ్డుపై పడేలా ఉన్నాడని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యాఖ్యల్లో పదును పెంచుతూ, వైసీపీ శ్రేణులకు తీవ్ర హెచ్చరికలు చేయడం తెలిసిందే. నిన్న కర్నూలులో టీడీపీ ఆఫీసు వద్ద వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ, తన కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. రండి చూసుకుందాం... మీ సంగతేంటో తేలుస్తా... రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను అంటూ వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. చంద్రబాబు ఒక పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తీరు చూస్తుంటే వీధి రౌడీని తలపిస్తోందని అన్నారు.
రాజకీయల్లో ఒక్కోసారి పూలు పడుతుంటాయి, ఒక్కోసారి రాళ్లు పడుతుంటాయి... వాటిని స్వీకరించాలే తప్ప రండి కొట్టుకుందాం అని వ్యాఖ్యలు చేయడం సరికాదని నారాయణస్వామి హితవు పలికారు.
చంద్రబాబు చొక్కా చించుకుని రోడ్లపై కాగితాలు ఏరుకునే స్థితికి చేరుకునేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తీరు కూడా ఇలాగే ఉందని నారాయణస్వామి అన్నారు. పవన్ లో రాజకీయనాయకుడికి ఉండాల్సిన లక్షణాలే లేవని విమర్శించారు.