ఖర్గేతో కవిత మాట్లాడారని కలగన్నారా?: వేముల ప్రశాంత్ రెడ్డి

  • ధర్మపురి అర్వింద్ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం కలుగుతుందన్న ప్రశాంత్ రెడ్డి 
  • బాండ్ పేపర్ పై రాసిచ్చి మాట తప్పిన నాయకుడు అర్వింద్ అంటూ విమర్శలు 
  • అర్వింద్ కుటుంబంలోని ముగ్గురూ మూడు పార్టీల్లో ఉన్నారంటూ ఎద్దేవా 
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం కలుగుతోందని టీఆర్ఎస్ నేత, మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అర్వింద్ అంటేనే నిలువెత్తు అబద్ధమని, అబద్ధాల పుట్ట అని చెప్పారు. బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట తప్పిన నాయకుడు అర్వింద్ అని విమర్శించారు. అర్వింద్ ను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదని చెప్పారు. 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కవిత మాట్లాడారని అర్వింద్ కలగన్నారా? అని ప్రశ్నించారు. పార్టీలు మారే కుటుంబం అర్వింద్ దేనని.. కుటుంబంలోని ముగ్గురు మూడు పార్టీల్లో ఉన్నారని అన్నారు. ఇళ్లపై దాడులు చేసే ఆటను మొదలు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు చేతులకు గాజులు వేసుకోలేదని చెప్పారు. మేము కూడా ఉప్పూకారం తింటున్నామని, మాకు కూడా కోపాలు వస్తాయని అన్నారు.


More Telugu News