బన్నీ పెద్ద హీరో అవుతాడని ముందుగానే ఆయన చెప్పేశారు: అల్లు అరవింద్   

  • వరుణ్ ధావన్ హీరోగా రూపొందిన 'తోడేలు'
  • కథానాయికగా అలరించనున్న కృతి సనన్
  • నిర్మాత దినేశ్ ను అభినందించిన అల్లు అరవింద్  
  • ఈ నెల 25వ తేదీన భారీ రిలీజ్   
వరుణ్ ధావన్ - కృతి సనన్ జంటగా హిందీలో రూపొందిన 'భేడియా' సినిమాను ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగులో 'తోడేలు' పేరుతో ఈ సినిమాను డబ్ చేశారు. పౌర్ణమి రోజున హీరోను ఒక తోడేలు కరుస్తుంది. అప్పటి నుంచి అతను ప్రతి పౌర్ణమి రాత్రికి తోడేలుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఈ లైన్ పైనే కథ అంతా నడుస్తుంది. 

ఆల్రెడీ ఈ లైన్ పై హాలీవుడ్ మూవీ వచ్చింది. కానీ బాలీవుడ్ వారు తమదైన స్టైల్ ట్రీట్మెంట్ ఈ కథను నడిపించారు. దినేశ్ విజయన్ నిర్మించిన ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించగా, అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో 'బాహుబలి' మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకు సౌత్ .. నార్త్ అనే ఎల్లలే లేవు" అన్నారు.  

"నార్త్ లో తీసిన సినిమా అయినా బాగుంటే ఇక్కడ ఆడుతుంది .. ఇక్కడ తీసిన సినిమా బాగుంటే అక్కడ ఆడుతుంది. మంచి సినిమా ఎక్కడ ఉన్నా మనం ప్రేమిస్తాం .. చూస్తాం. ఈ సినిమా నిర్మాత దినేశ్ గారు మూడేళ్ల క్రితమే బన్నీతో సినిమా తీయడానికి వచ్చారు. బన్నీ పెద్ద స్టార్ అవుతాడని చెప్పారు. ఆయన నమ్మకం 'పుష్ప' సినిమా ద్వారా ప్రూవ్ అయింది. భవిష్యత్తులో ఆయన బన్నీతో చేయాలనీ కోరుకుంటున్నాను" అన్నారు. 

" వరుణ్ ధావన్ గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే .. డబ్ చేసి ఆలిండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుంది. ఇక కృతి విషయానికొస్తే తను గ్లామర్ .. యాక్టింగ్ రెండూ ఉన్న హీరోయిన్. ఈ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కథ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మీ అందరికీ నచ్చుతుంది" అంటూ ముగించారు.


More Telugu News