'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- విభిన్నమైన కథాంశంతో వస్తున్న అల్లరి నరేశ్
- గిరిజన యువతిగా కనిపించనున్న ఆనంది
- ప్రధానమైన ఆకర్షణగా శ్రీచరణ్ పాకాల సంగీతం
- ఈ నెల 25వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
అల్లరి నరేశ్ - ఆనంది జంటగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. రాజేశ్ దండ నిర్మాణంలో ఏఆర్. మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కొంతకాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ఈ నెల 18వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాను 25వ తేదీకి వాయిదా వేశారు. చివరిగా అదే డేట్ ను ఫైనల్ చేశారు.
మారేడుమిల్లి ప్రాంతంలోని గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకుని రావడం కోసం హీరో చేసే పోరాటమే ఈ సినిమా కథ. అందుకోసం అక్కడికి వెళ్లిన ఆయన, అక్కడి గూడెం ప్రజల జీవితాల్లో కలిసిపోతాడు. అనాదిగా వాళ్లు జరుపుకుంటున్న జాతర సంబంధిత సంబరంలో భాగమవుతాడు. ఆ నేపథ్యంలో ఒక పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.
'కోలో కోలో కోయిల .. కొమ్మా రెమ్మా ఊయల, రేలా రేలా ఎన్నెలా ... జలజలా వాగులా' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, జావేదే అలీ - మోహన భోగరాజు ఆలపించారు. బీట్ . శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగున్నాయి. గిరిజనుల ఆచారాలకు .. వాళ్లు సంబరాలు జరుపుకునే తీరుకు చాలా దగ్గరగా ఈ పాట సాగుతూ ఆకట్టుకుంటుంది.