అమిత్ షాతో భేటీ అయిన మర్రి శశిధర్ రెడ్డి.. పార్టీ మారుతున్న సీనియర్ నేత!
- నిన్న రాత్రి అమిత్ షాను కలిసిన శశిధర్ రెడ్డి
- 40 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
- సమావేశానికి హాజరైన బండి సంజయ్, డీకే అరుణ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతారా? లేదా? అనే సందిగ్ధతకు పుల్ స్టాప్ పడింది. కేంద్ర హోమంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి ఆయన భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ భేటీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా హాజరయ్యారు. గురువారం రాత్రి అమిత్ షాతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే మర్రి శశిధర్ రెడ్డి గురించి చర్చ జరిగింది. అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయనను శశిధర్ రెడ్డి కలిశారు.
మరోవైపు తెలంగాణకు చెందిన పలు అంశాలను శశిధర్ రెడ్డితో అమిత్ షా చర్చించారు. టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించిన విధానాల గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలపై శశిధర్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు.