ఇవి కూడా మధుమేహం లక్షణాలే.. జాగ్రత్త!
- చర్మంపై దురదలు వస్తుంటే..
- తరచూ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటే..
- కంటి చూపు సన్నగిల్లుతుంటే..
- మెడ కింద చర్మంలో మార్పులు వస్తుంటే..
- ఒక్కసారి వైద్యులను సంప్రదించాల్సిందే
మధుమేహం పైకి కనిపించదు. లోపల్లోపలే తెలియకుండా నష్టం చేసేస్తుంది. అందుకే ఆరంభంలోనే టైప్-2 మధుమేహాన్ని గుర్తించి, సరైన ఆహార నియమాలు, నిద్ర వేళలు, ఔషధాల సాయంతో నియంత్రణలో పెట్టుకుంటే.. ఎటువంటి నష్టం ఉండదు. తెలుసుకోలేక, తెలిసినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా నష్టం వాటిల్లుతుంది. మధుమేహం మనకు ఉందని తెలుసుకోవడానికి సులభ మార్గం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకుంటే చాలు. మన శరీరంలోకి మధుమేహం సమస్య వచ్చిందని, కొన్ని లక్షణాల రూపంలో మనకు తెలుస్తూనే ఉంటుంది.
మెడ భాగంలో చర్మం మందం
మెడ కింద చర్మం మందంగా ఉంటుంది. లేదా నల్లగానూ ఉండొచ్చు. చర్మం మొత్తం ఒకే తీరున ఉండదు. కొన్ని చోట్ల మందం అనిపిస్తుంది. మెడికల్ పరిభాషలో దీన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ గా పిలుస్తారు.
వెంట వెంట ఇన్ఫెక్షన్లు
అదే పనిగా ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటే డయాబెటిస్ ఉందేమో అనుమానించాల్సిందే. మధుమేహంతో శరీర రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు వస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. స్త్రీలలో తరచూ వెజైనల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. బ్లాడర్, స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు.
కంటి చూపులో మార్పులు
ఆగకుండా కంటి చూపు తగ్గుతుంటే మధుమేహం ఉందేమో అనుమానించాలి. ముఖ్యంగా మధుమేహం ఉంటే కంటి చూపులో మార్పులు వేగంగా ఉంటాయి. అంతేకాదు, కళ్లు పొడిబారడం కూడా ఈ సమస్యలో ఉంటుంది.
లైంగిక సామర్థ్యం
రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే నరాలు దెబ్బతింటాయి. దీంతో లైంగిక సామర్థ్యంలో మార్పు కనిపిస్తుంది. స్త్రీలలో అయితే పునరుత్పత్తి అవయవం వద్ద లూబ్రికేషన్ తగ్గుతుంది. లైంగిక వాంఛలు కూడా తగ్గుతాయి. వయసులోనూ సామర్థ్యం సన్నగిల్లుతుందంటే అది కచ్చితంగా మధుమేహం లేదా హార్మోన్ సమస్యలు అయి ఉంటాయి. అందుకే వైద్యులను సంప్రదించాలి.
భావనలు
దేని పట్ల ఉత్సాహం అనిపించదు. ముభావంగా ఉంటారు. చిరాకు పడుతుంటారు. ఇలాంటి మార్పులు కనిపిస్తే వైద్యులను కలవాలి.
బరువు తగ్గడం
ఉన్నట్టుండి ఆశ్చర్యపడే రీతిలో బరువు తగ్గారంటే సమస్య ఉన్నట్టే. బరువు తగ్గడం ఒక్క మధుమేహంలోనే కనిపించేది కాదు. టీబీ, కేన్సర్ ఇలా ఇతర సమస్యల్లోనూ బరువు తగ్గుతుంటారు. కానీ, కుటుంబంలో ఎవరికైనా మధుమేహం చరిత్ర ఉంటే ఒక్కసారి వైద్య పరీక్షలకు వెళ్లాలి. మధుమేహంలో మన శరీంలోని కణాలకు గ్లూకోజ్ అందదు. దీంతో అప్పటికే ఉన్న కొవ్వును శరీరం ఖర్చు చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.
దురదలు
మధుమేహం వల్ల రక్త నాళాలు దెబ్బతినడంతో రక్త ప్రసరణలో అవరోధాలకు దారితీస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారిపోయి దురదలు వస్తుంటాయి.