ట్విట్టర్ లో ఉద్యోగుల తిండికి వంద కోట్లు ఖర్చు: మస్క్
- ఒక్క శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో ఏడాది ఉచిత మధ్యాహ్న భోజన ఖర్చు ఇదన్న ట్విట్టర్ అధినేత
- ఇకపై ఉచితంగా ఆహారం అందించేది లేదని స్పష్టీకరణ
- మస్క్ చెప్పేంత ఖర్చు కావడం లేదంటున్న మాజీ ఉద్యోగులు
ట్విట్టర్ లో పని చేస్తున్న ఉద్యోగులకు మధ్యాహ్న భోజన ఖర్చు కోట్లల్లో ఉంటుందని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ చెప్పారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు లంచ్ ఉచితంగా అందించేందుకు ఏడాదికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని తెలిపారు. ఇకపై మధ్యాహ్న భోజన ఖర్చులను ఉద్యోగులే భరించాలని మస్క్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో, మస్క్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఒక్కో ఉద్యోగికి మధ్యాహ్న భోజన ఖర్చు చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అలాగే, ఆఫీసుకు ఎవ్వరూ రాకపోవడంతో చాలా ఆహారం వృథా అవుతోందన్నారు. అందుకే ఉచిత భోజన సదుపాయం తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అయితే, చెబుతున్న దానిలో నిజం లేదని ట్విట్టర్ మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులే భోజనానికి రోజూ 20 నుంచి 25 డాలర్లు ఖర్చు చేస్తున్నారని, అలాగే ఆఫీసుకు రోజు 20 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు వస్తున్నారన్నారు. కానీ, సదరు మాజీ ఉద్యోగి వాదనలను ఖడించిన మస్క్ మరిన్ని వివరాలను వెల్లడించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఉద్యోగుల ఆహార సేవ కోసం సంవత్సరానికి 13 మిలియన్ డాలర్లను ట్విట్టర్ ఖర్చు చేస్తుందని ట్వీట్ చేశారు. భారత కరెన్సీలో దీని విలువ వంద కోట్ల రూపాయలు. ఒక్కో లంచ్‌కు దాదాపు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 32,000) ఖర్చవుతుందని మస్క్ గతంలో పేర్కొన్నారు.
ఇక, రికార్డుల ప్రకారం గరిష్ఠంగా 25 శాతం ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వస్తున్నారని చెప్పారు. సగటు ఆక్యుపెన్సీ 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. సిద్ధంగా ఉన్న అల్పాహారం తినే వారికంటే తిరిగి అల్పాహారం తయారు చేసుకునే వారే ఎక్కువ అన్నారు. అలాగే, కార్యాలయంలో రాత్రి పూట ఎవ్వరూ ఉండటం లేదు కాబట్టి వాళ్లు రాత్రి భోజనం గురించి ఆలోచించడమే లేదని చెప్పారు. సంస్థలో ఖర్చులు తగ్గించేందుకు మస్క్ ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు భోజనానికి ఛార్జీ విధించాలనే ఆయన నిర్ణయం ఆశ్చర్యం కలిగించడం లేదు.