కాంతార ఓటీటీ విడుదల ఖరారు.. ఎక్కడ చూడొచ్చంటే..!

  • చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న కన్నడ సినిమా
  • తెలుగు, తమిళ, హిందీలోనూ విశేష స్పందన
  • ఈ నెల 24 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ 
చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార' దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. ఈ కన్నడ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులు అలరించింది. సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఎక్కువ ప్రమోషన్స్ చేయకున్నా రోజు రోజుకూ బజ్ పెరిగింది. కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడై రికార్డు నెలకొల్పింది. ఇతర భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్ల పంట పడించింది. హీరో, దర్శకుడు రిషబ్ షెట్టి, హీరోయిన్ సప్తమి గౌడకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 
 
థియేటర్లలో ఇంకా సందడి చేస్తూనే ఉన్న ‘కాంతార’ ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులు దక్కించుకుంది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ, థియేటర్లలో విశేష స్పందన రావడంతో ఓటీటీ స్ట్రీమ్ ను వాయిదా వేశారు. ఎట్టకేలకు వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయాలని నిర్ణయించారు.


More Telugu News