పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరిన ఏపీ ప్రభుత్వం
- కేఆర్ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ లేఖ
- విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టు చేపట్టారని ఆరోపణ
- డీపీఆర్ ఇచ్చినట్టు తెలంగాణ చెబుతోందని వెల్లడి
- డీపీఆర్ కాపీ తమకు అందజేయాలని విజ్ఞప్తి
తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను ఏపీ జలవనరుల శాఖ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు.
ఇప్పటికే కేఆర్ఎంబీకి డీపీఆర్ ఇచ్చినట్టు తెలంగాణ చెబుతోందని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరు 3న జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణ ఈ విషయం చెప్పిందని, ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పేందుకు వీలుగా తమకు డీపీఆర్ కాపీ ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు.
కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించింది.