చంద్రబాబు కోరిక తప్పక నెరవేరుతుంది: బొత్స సత్యనారాయణ

చంద్రబాబు కోరిక తప్పక నెరవేరుతుంది: బొత్స సత్యనారాయణ
  • ఇవే తనకు చివరి ఎన్నికలు అని బాబు అన్నారన్న బొత్స
  • ఇక ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని వెల్లడి
  • మూడుసార్లు అవకాశం ఇచ్చినా మోసం చేశారని విమర్శలు
ఇవే తనకు చివరి ఎన్నికలు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని... ఆయన కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దేవుడు "తథాస్తు" అంటాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు మూడుసార్లు అవకాశం ఇచ్చారని... అన్నిసార్లు ఆయన మోసం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో తన భార్యను కించపరిచారంటూ సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

మరోవైపు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని అన్నారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసని... చంద్రబాబుకే ఈ విషయం తెలియడానికి చాలా కాలం పట్టిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కుప్పం కూడా చంద్రబాబు చేజారిపోయిందని అన్నారు.


More Telugu News