కుమార్తె సినీ ఎంట్రీపై మంత్రి రోజా స్పందన
- తిరుమల విచ్చేసిన రోజా
- శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో చిట్ చాట్
- అన్షుమాలిక సినీ ఎంట్రీపై ప్రశ్నించిన మీడియా
- తన కుమార్తెకు సైంటిస్ట్ అవ్వాలనుందని వెల్లడించిన రోజా
- ఒకవేళ సినిమాల్లోకి వస్తే ప్రోత్సహిస్తానని స్పష్టీకరణ
ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా గతంలో ప్రముఖ హీరోయిన్ అని తెలిసిందే. రోజాకు అన్షుమాలిక అనే కుమార్తె, కృష్ణ లోహిత్ అనే కుమారుడు ఉన్నారు. చదువుల్లో ముందున్న అన్షుమాలిక చిన్నవయసులోనే సామాజిక సేవల పట్ల ఆకర్షితురాలై ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయసహకారాలు అందిస్తోంది.
కాగా, రోజా బాటలోనే అన్షుమాలిక కూడా సినీ రంగంలోకి వస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఓ హీరో కుమారుడి సరసన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై మంత్రి రోజా స్పందించారు.
"యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవడం తప్పు అని ఎప్పుడూ అనను. నా కూతురు, కొడుకు గనుక యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురుకి బాగా చదువుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను బాగా చదువుకుంటోంది. ఇప్పటివరకైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఒకవేళ తను సినిమాల్లోకి వస్తే మాత్రం ఓ తల్లిగా ఆశీర్వదిస్తాను, అండగా నిలబడతాను" అని చెప్పారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.