ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్​ కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్!

  • వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టు
  • భారత్ తో నాలుగు టెస్టులు ఆడనున్న ఆసీస్
  • తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఛాన్స్
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పబోతోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత హైదారాబాద్ ఉప్పల్ స్టేడియానికి టెస్టు మ్యాచ్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా టీమిండియాతో ఆసీస్ నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ లో తొలి టెస్టుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ను నిర్వహించే అవకాశం కోసం హైదరాబాద్ తో పాటు నాగ్‌పూర్‌, చెన్నై కూడా పోటీ పడుతున్నాయి. 2018లో చివరిసారి హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌ జరిగింది.

కాగా, ఆస్ట్రేలియాతో సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే, రెండో టెస్టును ఢిల్లీలో, మూడో టెస్టును ధర్మశాలలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. చివరి టెస్టుకు అహ్మదాబాద్‌ను వేదికగా అనుకుంటోంది. ఈ నాలుగు టెస్టుల్లో ఒకటి డే నైట్‌ (పింక్ బాల్) మ్యాచ్‌గా ఉండనుంది. ప్రపంచంలోనే అది పెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News