శ్రద్ధ వాకర్ హత్య కేసు.. పోలీసులు సేకరించిన సాక్ష్యాలు ఇవే!
- దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మర్డర్
- శ్రద్ధను చంపేసి 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్ అమీన్
- విచారణలో వేగం పెంచిన పోలీసులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని విచారిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. శ్రద్ధ శరీర భాగాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అఫ్తాబ్ కు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధ వాకర్ ను అఫ్తాబ్ దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే!
మృతదేహాన్ని ముక్కలుగా నరికి, తన ఫ్లాట్ లోనే 18 రోజుల పాటు దాచినట్లు అఫ్తాబ్ వెల్లడించాడు. రోజూ అర్ధరాత్రి దాటాక శ్రద్ధ శరీర భాగాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేసినట్లు చెప్పాడు. విచారణలో పలు విషయాలను వెల్లడించిన అఫ్తాబ్.. కీలక విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రం నోరు తెరవడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్తాబ్ కు నార్కో టెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
పోలీసులు సేకరించిన సాక్ష్యాలు..
ఇప్పటికీ దొరకనివి..

- హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ అంగీకారం..
- ఫ్రిడ్జ్ కొనుగోలుకు సంబంధించిన రిసీప్ట్, షాపు యజమాని వాంగ్మూలం
- అఫ్తాబ్ కత్తి గాయానికి చికిత్స చేసిన డాక్టర్ స్టేట్ మెంట్
- అపార్ట్ మెంట్ వెనకున్న అడవిలో నుంచి సేకరించిన శ్రద్ధ శరీర భాగాలు
- శ్రద్ధ బ్యాంకు ఖాతా నుంచి రూ. 54 వేలు అఫ్తాబ్ ఖాతాలోకి బదిలీ..
- కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్ వివరాలు
ఇప్పటికీ దొరకనివి..
- హత్యకు ఉపయోగించిన ఆయుధం (కత్తి)
- శ్రద్ధ మిగిలిన శరీర భాగాలు
- హత్యకు గురైన సమయంలో శ్రద్ధ వేసుకున్న బట్టలు
- శ్రద్ధ మొబైల్ ఫోన్ ఇప్పటికీ దొరకలేదని పోలీసులు చెప్పారు.